IDBI Bank Executive Sales and Operations notification 2024 in Telugu
IDBI Bank Executive Sales and Operations notification 2024 in telugu: IDBI Bank నుండి బ్యాంకుల్లో పని చేయడానికి ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.ఈ ఐడిబిఐ బ్యాంక్ నోటిఫికేషన్ ద్వారా 1000 ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఐడిబిఐ బ్యాంక్ నోటిఫికేషన్ 6 నవంబర్ 2024 వ తేదీన విడుదల అయింది.
ఈ ఐడిబిఐ ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు 7 నవంబర్ 2024వ తేదీ నుండి 16 నవంబర్ 2024 వ తేదీ లోపు www.idbibank.in వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి.
ఈ ఐడిబిఐ ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ నోటిఫికేషన్ కోసం పరీక్ష డిసెంబర్ 1, 2024 వ తేదీన ఉంటుంది.
Age limit for IDBI Executive Sales and Operations recruitment:
ఈ ఐడిబిఐ ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే అభ్యర్థులు 20 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయస్సును కలిగి ఉండాలి. (కట్ ఆఫ్ 1, అక్టోబర్ 2024)
(అంటే అభ్యర్థులు 2, అక్టోబర్ 1999 వ తేదీ నుండి 1, అక్టోబర్ 2004 వ తేదీల మధ్య పుట్టి ఉండాలి)
ఎస్సీ మరియు ఎస్టీకి 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
ఓబీసీకి 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
Educational qualification for IDBI Executive Sales and Operations recruitment 2024 in telugu:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులందరూ ఈ నోటిఫికేషన్ కి అర్హులు.
కంప్యూటర్ పైన అవగాహన కలిగి ఉండాలి.
Selection process for Executive Sales and Operations recruitment 2024 in telugu:
1) ఆన్లైన్ టెస్ట్
2) డాక్యుమెంట్ వెరిఫికేషన్
3) పర్సనల్ ఇంటర్వ్యూ
4) మెడికల్ టెస్ట్
1. Online test (Objective Type):
1). లాజికల్ రీజనింగ్, డేటా అనాలసిస్ & ఇంటర్ప్రిటేషన్- 60 ప్రశ్నలు -60 మార్కులకు - 40 నిమిషాలు
2). ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 40 ప్రశ్నలు - 40 మార్కులు - 20 నిమిషాలు
3). క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 40 ప్రశ్నలు - 40 మార్కులు - 35 నిమిషాలు
4). జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్/కంప్యూటర్/ఐటి- 60 ప్రశ్నలు - 60 మార్కులు - 25 నిమిషాలు
మొత్తం 200 ప్రశ్నలకు గాను 200 మార్కులతో 120 నిమిషాల పాటు పరీక్ష ను నిర్వహించడం జరుగుతుంది. పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. సెక్షనల్ టైమింగ్ కూడా ఉంది.
సెలెక్ట్ అయినా అభ్యర్థుల కి రెండు సంవత్సరాల కాంట్రాక్టు పీరియడ్ ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ పీరియడ్లో మొదటి సంవత్సరంలో నెలకు 29,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, మొదటి సంవత్సరంలో పర్ఫామెన్స్ ని బట్టి రెండవ సంవత్సరం కూడా కాంట్రాక్ట్ పీరియడ్ను కంటిన్యూ చేయడం జరుగుతుంది. రెండవ సంవత్సరంలో నెలకు 31,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు సంవత్సరంల కాంట్రాక్ట్ పీరియడ్ కంప్లీట్ చేసిన తర్వాత అభ్యర్థుల కి కొన్ని టెస్టులను నిర్వహించి ఐడిబిఐ బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, గ్రేడు ‘ఓ' పోస్ట్ కు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, గ్రేడు ‘ఓ'ఉద్యోగం పర్మినెంట్ ఉద్యోగం.
Examination fee for IDHI Executive Sales and Operations recruitment:
అభ్యర్థులు ఐడిబిఐ ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫీజు కింద 1,050 రూపాయలను చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టి మరియు PwBD అభ్యర్థులు 250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 16 నవంబర్, 2024.
Examination Centers for IDBI Executive Sales and Operations recruitment:
ఆంధ్రప్రదేశ్: ఏలూరు,గుంటూరు, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, ఒంగోల్, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
Salary: 29,000 రూపాయలు ప్రతినెల ( మొదటి సంవత్సరంలో)
31,000 రూపాయలు ప్రతినెల (రెండవ సంవత్సరంలో)
0 కామెంట్‌లు